
బిగ్‌బాస్ 9వ సీజన్‍లో మూడో ఎలిమినేషన్ జరిగింది. డాక్టర్ పాప ప్రియ బయటకొచ్చేసింది. మొత్తంగా ఆరుగురు సామాన్యుల్లో ఒకరిగా అడుగుపెట్టిన ఈమె.. ఎక్కువ వారాలు ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ అనుహ్యంగా త్వరగానే ఔట్ అయిపోయి హౌస్‌ని వీడింది. మరి ప్రియ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?
కర్నూలుకి చెందిన ప్రియ.. నటి కావాలని ఆశపడింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో డాక్టర్ అయింది. రీసెంట్‌గా ఈమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. దాని నుంచి తప్పించుకునేందుకు బిగ్‌బాస్‌లోకి రావాలనుకుంది. అలా అగ్నిపరీక్ష పోటీలో నెగ్గి ఐదో కామనర్‌గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది అని మాటే గానీ ప్రతిదానికి మొదటి నుంచి ఓవరాక్షన్ చేయడం ఈమెకు చాలా మైనస్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?)
అలానే ఇచ్చిన సంచాలక్ పనిని కూడా సక్రమంగా చేయలేదు. అక్కడొకటి జరిగితే ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసేసుకోవడం లాంటి వాటి వల్ల ఈమెపై చాలా నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో ఫ్లోరా.. ఇమ్యూనిటీ సాధించి సేవ్ అయిపోయింది. మిగిలిన వారిలో హరీశ్, రాము, రీతూ, కల్యాణ్, ప్రియ ఉండగా.. వీళ్లలో అతి తక్కువ ఓట్లు ప్రియకే పడ్డాయి. అంటే ప్రేక్షకుల్లో ఈమె పట్ల ఎక్కువగానే నెగిటివిటీ ఏర్పడింది. దీంతో మూడో వారం ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేసింది.
మూడు వారాల పాటు హౌసులో ప్రియ ఉంది. అయితే వారానికి రూ.70 వేల చొప్పున ఈమెకు అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. అలా మూడు వారాలకుగానూ రూ.2.10 లక్షల పారితోషికం ఈమె అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను మరికొన్ని వారాల పాటు ఉంటానని అనుకున్నానని, కానీ ఇలా జరిగిపోవడం కాస్తంత బాధగానే ఉందని హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ నాగార్జునతో చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్)