
కొన్నిరోజుల క్రితం ఈ యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే ప్రమాదం ఏం లేదని ఆయన టీమ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత పెద్దగా బయటకు రాని ఎన్టీఆర్.. ఇప్పుడు 'కాంతార 1' కోసం వచ్చాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు.
రిషభ్ శెట్టి నటించిన ఈ సినిమా.. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బెంగళూరు, కొచ్చిలో ప్రెస్ మీట్స్ జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకకు సింపుల్‌గా వచ్చిన కూర్చునేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. భుజం దిగువన చేయి పెడుతూ నొప్పిని ఫీలవుతున్నట్లు కనిపించాడు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్)
ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే 'కాంతార 1' చిత్రంలోనూ తారక్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని గతంలో రూమర్స్ లాంటివి వచ్చాయి. కాకపోతే ఇవి నిజమా లేదా అనేది తెలియదు. అలానే రిషభ్ శెట్టి అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. బహుశా ఆ కారణం వల్లనో ఏమో గానీ నొప్పి ఇబ్బంది పెడుతున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. దీన్ని త్వరగానే ముగించేశారు కూడా!
2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ తీశారు. అప్పుడొచ్చిన సినిమాలో ప్రస్తుతం ఏం జరిగిందనే విషయాన్ని చూపించారు. ఈసారి మాత్రం గతంలో అసలేమేం జరిగింది? అనేది చూపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైంది. అయితే ట్రైలర్‌లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది కానీ స్టోరీ పరంగా పెద్దగా రివీల్ చేయలేదు. మరి థియేటర్లలో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి)
Man of Masses @tarak9999 arrives at grand pre-release event of #KantaraChapter1 🔥 pic.twitter.com/FKJjIQwmFT
— Telugu Film Producers Council (@tfpcin) September 28, 2025