
'విరూపాక్ష' సినిమాతో హిట్ కొట్టి ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ.. హరిత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ వేడుక జరగ్గా.. నాగచైతన్య-శోభిత దంపతులు, హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు హాజరైన కాబోయే వధూవరుల్ని దీవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఆమెకు ముద్దులిస్తే..వారానికి రూ. 1000 ఇచ్చేది : స్టార్ హీరో)
మూడు నాలుగు నెలల క్రితం కార్తిక్ వర్మ నిశ్చితార్థం అని చెప్పి కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అది పెళ్లిచూపులు కార్యక్రమం అని ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లయింది. కార్తిక్ విషయానికొస్తే.. 'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో ఒకడు. 'కార్తికేయ' సినిమాకు రైటర్‌గా పనిచేశాడు. తర్వాత 2015లో 'భమ్ భోలేనాథ్' అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో మరో మూవీ తీసేందుకు చాన్నాళ్లు పట్టింది. అలా కొన్నేళ్ల తర్వాత మెగాహీరో సాయిధరమ్ తేజ్‌తో 'విరూపాక్ష' తీశాడు. ఇది సూపర్ హిట్ అయింది.
'విరూపాక్ష' సక్సెస్ తర్వాత నాగచైతన్యతో సినిమా చేసే కార్తిక్ వర్మని వరించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే కార్తిక్ చేసుకోబోయే అమ్మాయి హరితది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. బంధువుల అమ్మాయిలా అనిపిస్తుంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఉండొచ్చు.
(చదవండి: సినిమా బాగోకపోతే ఏం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ మాటలకు ఏడ్చేశా)

