
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman).. ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు. స్టార్ హీరోలందరి సినిమాలకు పని చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. తమన్.. చివరగా ఓజీ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నేనేం తప్పు చేశా?
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. 'ఓ సినిమా విషయంలో మహేశ్‌బాబు (Mahesh Babu) అభిమానులు నన్ను నానామాటలన్నారు. ఎంతో బాధపడ్డాను. నేనేం తప్పు చేశాను? మహేశ్‌బాబుగారికి నేనేం బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను? నేను ఏ తప్పు చేయలేదే? అని డార్క్ రూమ్‌లో కూర్చుని ఏడ్చాను. సినిమా బాగోలేకపోతే దానికి మనమేం చేస్తాం? ఈ విషయం అభిమానులెందుకు అర్థం చేసుకోరని బాధేసింది.
అండగా ఉన్నాడు
నా బాధను అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆరు నెలలవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండమన్నాడు. ఆ నెగెటివ్ కామెంట్లు ఏవీ చూడొద్దన్నాడు. నేను నీతో ఉన్నా.. నేను చూసుకుంటా.. నువ్వు మళ్లీ నిరూపించుకోగలవు అని ధైర్యం చెప్పాడు' అని పేర్కొన్నాడు. కాగా మహేశ్‌బాబు నటించిన బిజినెస్‌మెన్, ఆగడు, దూకుడు, సర్కారువారిపాట, గుంటూరు కారం చిత్రాలకు తమనే సంగీతం అందించాడు.
చదవండి: షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి