
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్‌గా ఎదిగాడు. ఆస్తులు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆయనకు ఈజీగా చాన్స్లు రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. హీరోగా చాన్స్ రాకకోవడంతో సెకండ్, థర్డ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1993లో పరంపర సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒకానొక దశలో పాత్రల కోసం అడుక్కోవాల్సి వచ్చిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదైరన ఓ వింత ఘటన గురించి చెప్పాడు. డబ్బుల కోసం ఓ మహిళా నిర్మాతకు పదిసార్లు ముద్దులు పెట్టానని చెప్పాడు.
(చదవండి: సినిమా బాగోలేకపోతే నేనేం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ అన్న మాటలకు ఏడ్చేశా..)
‘కెరీర్ ప్రారంభంలో చాన్స్లు రాలేదు. ఓ మహిళా నిర్మాత ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆమె ఒక కండీషన్ పెట్టింది. తన బుగ్గలపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా 10 ముద్దులు పెట్టి వారానికి రూ. 1000 తీసుకునేవాడిని’అని సైఫ్ చెప్పుకొచ్చాడు.
(చదవండి: ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. మరి ఆ ఇద్దరు ఏం త్యాగం చేశారు? శ్రీజకు పనిష్మెంట్!)
ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అవకాశాలు వచ్చాయన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించాడు. ‘నాకు సినిమా బ్యాక్గ్రౌండ్( బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ కొడుకే సైఫ్) ఉందని, అదృష్టంతో స్టార్ అయ్యానని అంతా అనుకుంటారు. కానీ నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేనని నేను భావిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం’ అన్నారు. కాగా సైఫ్‌కు 2001లో వచ్చిన ‘దిల్ చాహ్‌తా హై’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది.
ఈ చిత్రంలో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. చివరగా జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘హైవాన్’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ చిత్రానికి పిరయదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేడేళ్ల క్రితం హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు.