
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. దీంతో దాదాపుగా షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు నెలన్నర క్రితం 'వార్ 2' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. హిందీలో ఓ మాదిరిగా ఆడింది గానీ తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. హిందీలో 'వార్ 2' చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్పై యూనివర్స్‌లో వచ్చిన సినిమా ఇది. హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే టాక్ ఏ మాత్రం పాజిటివ్ రాకపోవడంతో వసూళ్లు కూడా తక్కువగానే వచ్చాయి.
(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్)
ఇకపోతే హిందీ సినిమాలు చాలావరకు 8 వారాల విండోతోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు 'వార్ 2' కూడా అలానే నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతుందని, అయితే దసరా సందర్భంగా ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని మరో మాట వినిపిస్తుంది. ఇదే జరిగితే అక్టోబరు 2న లేదంటే 9న రావొచ్చని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?
'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్‌లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్‌తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్‌ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్‌కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి)