
ప్రియా శెట్టి (Priya Shetty)... అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు అందరూ క్యూట్ అన్నారు. తీరా బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9)కి వచ్చాక ఈమె మాకొద్దని అందరూ దండం పెట్టేశారు. ఈమె అరుపులకు, గొడవలకు చెవులకు చిల్లులు పడేలా ఉన్నాయంటూ మూడోవారమే తనను బయటకు పంపేశారు. తాజాగా తన బిగ్‌బాస్ అనుభవాన్ని బయటపెట్టింది ప్రియ. ఆమె మాట్లాడుతూ.. నేను హైపర్ యాక్టివ్. బిగ్‌బాస్ షోలో నేను నాలా ఉన్నాను. గొడవలు జరిగినప్పుడు నేనే కాదు, అందరూ అరిచారు.
లేడీ లక్.. అప్పుడే నచ్చలే
హౌస్‌లో అందరికంటే నేనే ఎక్కువ ఏడ్చాను. కానీ ఎపిసోడ్‌లో అది కనిపించలేదు. అగ్నిపరీక్షలో షాకీబ్‌తో కలిసి లేడీ లక్ అని లవ్ ట్రాక్స్ క్రియేట్ చేశారు. జనాలు నన్ను ఆ కోణంలో చూడటం నాకు నచ్చదు. అలాంటి లవ్ ట్రాకులు నాకు గిట్టవు. షోలో ప్రేమాయణాలు నడిపించడమనేది ఇష్టం లేదు. షోలో నాకెవరూ నచ్చరని ఫిక్సయ్యే షోకి వెళ్లాను. అమ్మానాన్న నాకోసం సంబంధాలు చూస్తున్నారు. నేనేమైనా పిచ్చిపనులు చేస్తే.. ఏంటండి? మీ అమ్మాయి అలా చేస్తోందని అడుగుతారు. అలాంటివన్నీ అవసరమా?
అక్క అని పిల్చేవాడు కాదు
అలాంటి ట్రాకులు నాకొద్దు అని క్లారిటీతో ఉన్నాను. నాకంటూ కొన్ని హద్దులు గీసుకున్నాను. పవన్ కల్యాణ్.. నాకంటే చిన్నోడు. వాడు నన్నెప్పుడూ పెద్దమ్మ, శూర్పనఖ, పెద్దక్క అని పిలుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అక్క అని పిలవమంటే పిలిచేవాడు కాదు. పిలవలేక కాదు, నన్ను విసిగించాలని! గయ్యాళి, రాక్షసి అనే పిలిచేవాడు. మొదటినుంచి మా ఇద్దరి మధ్య అక్కాతమ్ముడి అనుబంధమే ఉంది. తనెప్పుడూ అసౌకర్యంగా టచ్ చేయలేదు. నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఓదార్చడానికి వస్తే.. వద్దురా బాబు, నన్ను వదిలెయ్ అని తోసేదాన్ని. కల్యాణ్‌నే కాదు ఎవర్నీ నా దగ్గరకు రానివ్వలేదు అని ప్రియ క్లారిటీ ఇచ్చింది.
ఓదార్పు యాత్ర
బిగ్‌బాస్ హౌస్‌లో ట్రయాంగిల్, స్క్వేర్ అని కొన్ని ట్రాకులు నడుస్తున్నాయి. ఇద్దరు పవన్‌ల మధ్య రీతూ చౌదరి ఉండటంతో ఇదో ట్రయాంగిల్‌లా మారింది. ఇక పవన్ కల్యాణ్.. ఎవరైనా ఏడిస్తే చాలు ఓదార్పు యాత్ర మొదలుపెట్టేవాడు. అమ్మాయిలకు హగ్గులిచ్చి చిన్నపిల్లల్ని ఓదార్చినట్లు ఓదార్చేవాడు. తను చూసే పద్ధతి కూడా అస్సలు బాగుండేది కాదు. ఇక చాలాసార్లు ప్రియ.. అతడు హగ్ ఇవ్వడానికి వస్తుంటే తప్పించుకుని పారిపోయేది. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రియను ప్రేక్షకులు మెచ్చుకున్నారు.