తిరుమలో ఇచ్చే దేవుని ప్రసాదంపై నోరుపారేసుకున్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది. ఇటీవల తన సోదరుడు, భర్తతో కలిసి శివజ్యోతి.. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లింది. అక్కడ భక్తుల కోసం ఇస్తున్న ప్రసాదాన్ని తీసుకున్న సోదరుడిని ఉద్దేశించి.. సోనీ కాస్ట్‌లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు.. అని ఎగతాళి చసింది. ఆమె సోదరుడు కూడా.. జీవితంలో ఎప్పుడూ ఇలా అడుక్కోలేదు.. ఫస్ట్ టైమ్ ఇలా అడుక్కుంటున్నానని పేర్కొన్నాడు.
నన్ను క్షమించండి
తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనని భర్తతో ప్రసాదం గురించి కామెడీ చేసింది. దేవుని ప్రసాదం విషయంలో ఈ చిల్లర కామెంట్స్ ఏంటని సోషల్ మీడియాలో జనాలు మండిపడ్డారు. దీంతో శివజ్యోతి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి. నా వల్ల హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి.
తప్పు జరిగింది
నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయేవారికి నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఎంతిష్టమో బాగా తెలుసు. మూడు, నాలుగు నెలలుగా శనివారాల వ్రతం గురించి ప్రచారం చేస్తూనే ఉన్నా.. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. దురదృష్టవశాత్తూ ప్రసాదం గురించి నేను అన్న కామెంట్స్‌పైనే మాట్లాడుతున్నారు. ఏదేమైనా నావైపు నుంచి తప్పు జరిగింది. నా మాటలు తప్పుగా ఉన్నాయి. కానీ, నా ఉద్దేశ్యం అయితే అదికాదు.
ఆయన గురించి ఎలా..?
కాస్ట్‌లీ లైన్‌లో నిలబడ్డామన్న ఉద్దేశంతో మేము రిచ్ అన్నాను. నా తరపున, నా తమ్ముడి తరపున అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఇంట్లో, నా చేతిపై వెంకటేశ్వరస్వామి ఉన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా నా జీవితంలో అత్యంత విలువైనది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వరస్వామే ఇచ్చిండు. ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతాను? వెంకటేశ్వరస్వామి నా జీవితాన్నే మార్చిండు. ఆయన దయ లేకపోతే నేను అనుభవించేదేదీ నాకు రాదు.
తల్లి కాబోతున్న శివజ్యోతి
తెలిసో తెలియకో మా నోటి నుంచి పొరపాటు వ్యాఖ్యలు వచ్చాయి. అందుకు మన్నించండి అని పేర్కొంది. కాగా పెళ్లయిన 11 ఏళ్లకు శివజ్యోతి తల్లి కాబోతోంది. ఏడు శనివారాల వ్రతం చేయడం వల్లే తాను గర్భం దాల్చానని, జీవితాంతం స్వామివారి సేవలోనే ఉంటానని చెప్తూ పొంగిపోయింది. అంత భక్తితో వెంకన్ను కొలిచిన శివజ్యోతి ఇప్పుడాయన ప్రసాదం గురించి తప్పుగా మాట్లాడటం.. దానిపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పింది.
చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్


