సుమన్ చేసిన పొరపాటు వల్ల, తనూజ కంగారు వల్ల కెప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది. రీతూ కెప్టెన్‌గా గెలిచింది. ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్ రాగా వీకెండ్‌లో కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. టాప్ 5లో ఎవరుంటారో తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ విశేషాలు శనివారం (నవంబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
జీవితంలో ముఖం చూడను
(Bigg Boss Telugu 9) తనూజతో జరిగిన గొడవ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది దివ్య. మీకిష్టం లేకపోయినా మీ వెంటపడుతున్నానని కామెంట్స్‌తో బాధపెట్టింది. బయటకెళ్లాక జీవితంలో తన ముఖం చూడను అంది. నాగార్జున స్టేజీపైకి వచ్చి తనూజ- దివ్య గొడవ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్ అవగానే కళ్లు నెత్తికెక్కాయా? అని తనూజకు క్లాస్ పీకాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసిందే నువ్వని దివ్యను తిట్టిపోశాడు. అలా ఇద్దరికీ కాస్త గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీపైకి పిలిచాడు.
తనూజ నా మనవరాలు
మొదటగా భరణి (Bharani Shankar) తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజీపైకి వచ్చాడు. తనూజ (Thanuja Puttaswamy)ను మనవరాలు అని పిలిచిన భరణి తల్లి.. దివ్యను మాత్రం పరోక్షంగా జాగ్రత్త అని హెచ్చరించింది. కొడుకుపై అరవొద్దు అన్నట్లుగా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది. వీళ్లు.. భరణి, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనను టాప్ 5లో వరుసగా పెట్టారు.
కల్యాణ్ తండ్రి గొప్ప మాటలు
తర్వాత కళ్యాణ్ కోసం తండ్రి లక్ష్మణ్‌రావు, తమ్ముడు బాలు వచ్చారు. కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, పవన్‌ను టాప్ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ అన్నతో పాటు కమెడియన్ అవినాష్ వచ్చారు. ఇమ్మూ, తనూజ, కల్యాణ్, పవన్, రీతూని టాప్ 5లో పెట్టారు. అవినాష్ తనూజకు మహానటి, కట్టప్ప అవార్డులు ఇచ్చాడు.
టాప్5 చివర్లో దివ్య
తర్వాత దివ్య తాతయ్య, స్నేహితురాలు వచ్చారు. వీళ్లిద్దరూ.. ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్, దివ్యను టాప్ 5లో పెట్టారు. దివ్యను చివర్లో పెట్టిన తాతయ్య.. నువ్వింకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇకపోతే ఈ వారం దివ్య-తనూజ గొడవతో టీఆర్పీలు బద్ధలైపోయాయట. దీంతో బిగ్‌బాస్ టీమ్ దివ్యను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించేందుకు సిద్ధమైందట! ఆ సంగతులు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం..


