ఇక నువ్వు సినిమానే ప్రేమించాలన్నారు!: దర్శకుడు పి. మహేశ్‌బాబు | Director P Mahesh Babu Speech about Andhra King Taluka | Sakshi
Sakshi News home page

ఇక నువ్వు సినిమానే ప్రేమించాలన్నారు!: దర్శకుడు పి. మహేశ్‌బాబు

Nov 25 2025 12:11 AM | Updated on Nov 25 2025 12:11 AM

Director P Mahesh Babu Speech about Andhra King Taluka

‘‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమా కథని నవీన్, రవిశంకర్‌గార్లకు చెప్పినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యారు. ఈ కథని రామ్‌గారికి వినిపించమన్నారు. రామ్‌గారికి ఫోన్‌ చేస్తే... 20 నిమిషాల్లో కథ చెప్పగలవా? అన్నారు. మరుసటి రోజు వెళ్లి ఆయనకు కథ చెప్పడం ప్రారంభించిన పది నిమిషాలకే... సమయం ఎంత అయినా పర్లేదు పూర్తిగా చెప్పమన్నారు. దాదాపు నాలుగు గంటలు కథ వినిపించి, తిరిగొచ్చేశాను.

ఆ తర్వాత నిర్మాతలు ఫోన్‌ చేసి, ‘రామ్‌ మొదటి సిట్టింగ్‌లో ఓకే చేసిన కథ ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ అని చెప్పారు’’ అన్నారు  దర్శకుడు పి. మహేశ్‌బాబు. రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా పి. మహేశ్‌ బాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమా 2002 సమయంలో జరుగుతుంది. అందుకే ముందు ‘ఆంధ్ర కింగ్‌’ అనే టైటిల్‌ పెట్టాను. అయితే ఆ తర్వాత ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ అని మార్చాం.

ఈ కథలో ఒక ఫ్యాన్‌ ఎలా బిహేవ్‌ చేస్తాడో, ఎంత మాస్‌గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్‌ కావాలి. అందుకే ఈపాత్రకి రామ్‌గారు పర్ఫెక్ట్‌. ఆంధ్ర కింగ్‌ సూర్యపాత్రలో ఉపేంద్రగారు అద్భుతంగా నటించారు. మా గురువు కృష్ణవంశీగారికి ఫ్యాన్‌ని. ‘నీకు నేనంటే కాదు సినిమా అంటే ఇష్టం. సినిమా పట్ల ఇష్టంతో ఇక్కడికి వచ్చావు. నేను టూల్‌లా ఉపయోగపడ్డా. ఇకపై నువ్వు సినిమానే ప్రేమించాలి.. నన్ను కాదన్నప్పుడు కదిలిపోయాను’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement