సినీ పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం లాంటిది. ఎంత పెద్ద హీరోహీరోయిన్ అయినా సరే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. సినిమాలు చేయడంతో పాటు ఎవరితో పరిచయం పెంచుకుంటున్నామో కూడా అప్పుడప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంతే సంగతులు. ఈ హీరోయిన్ కూడా అలానే ఓ క్రేజీ హీరోయిన్. కానీ డాన్‌ని ప్రేమించి జైలుపాలైంది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోనికా బేడీ. ప్రస్తుత జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో తెలుగు, హిందీ సినిమాలు చూసిన వాళ్లకు ఈమె సుపరిచితమే. పంజాబ్‌లోని చబ్బేవాల్ గ్రామానికి చెందిన ఈమె.. 1994లో హిందీలో తొలి మూవీ చేసింది. తర్వాతి ఏడాది శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్ మహల్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శివయ్య, సోగ్గాడి పెళ్లాం, సర్కస్ సత్తిపండు, చూడాలని ఉంది తదితర చిత్రాల్లో నటించింది. హిందీలో అయితే సల్మాన్, షారుఖ్ లాంటి హీరోలతో చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడివరకు బాగానే ఉంది.
(ఇదీ చదవండి: దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్)
హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని స్వయంగా మోనికానే వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దుబాయిలో ఈవెంట్ కోసం నాకు ఫోన్ చేశారు. చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం దుబాయి వెళ్లినప్పుడు మొదటి సారిగా ఆయనని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు మాట్లాడుకున్నాం. అబు మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను. కానీ డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడ్డానని మెనికా చెప్పింది.
డాన్‌తో ప్రేమలో పడిన తర్వాత సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. 2022 సెప్టెంబరులో నకిలీ పత్రాలతో దేశంలోకి వచ్చినందుకుగానూ పోర్చుగల్‌లో మోనికాతో పాటు అబూ సలేంని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించింది. అలా డాన్‌తో ప్రేమలో పడటం అనే ఒక్క తప్పటగుడు ఈమె కెరీర్ ఇబ్బందుల్లో పడటానికి కారణమైంది. తర్వాత మళ్లీ నటిగా పలు సినిమాలు చేసింది. 2017లో చివరగా ఓ పంజాబీ చిత్రంలో నటించింది. బిగ్‌బాస్ హిందీ 2వ సీజన్‌లోనూ పాల్గొంది గానీ ఓకే ఓకే అనిపించింది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో అడపాదడపా కనిపిస్తూనే ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


