టాలీవుడ్ నటుడు, కమెడియన్ జోష్ రవి కుటుంబాన్ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి పరామర్శించారు. స్వయంగా రవి ఇంటికి వెళ్లి అతన్ని హత్తుకుని ధైర్యం చెప్పారు. అనంతరం జోష్ రవి తల్లిని ఓదార్చారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని.. ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా.. ఇటీవలే జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.


