బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) భలే తెలివైనోడు.. ఇమ్మాన్యుయేల్‌తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్(నవంబర్ 23)లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారో చూసేద్దాం..
సుమన్ కోసం పిల్లలు
సుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్లను చూడగానే సుమన్‌కు కళ్లలో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. గేమ్ బాగా ఆడాలని సుమన్‌కు సూచించాడు. సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్‌ను టాప్ 5లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనల్లుడు వచ్చారు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్మూ, కల్యాణ్, తనూజ, సుమన్‌ను టాప్ 5లో పెట్టారు.

రీతూ కోసం అఖిల
తర్వాత రీతూ కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగెటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావ్ అని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డిమాన్ పవన్‌ను టాప్ 5లో పెట్టారు. అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది.
మనీష్‌కు కౌంటర్
పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం.. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి.. ముద్దుముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్‌కు ఇప్పుడు కౌంటరిచ్చింది. ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త.. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది.

దివ్యను కాపాడేందుకు స్కెచ్
డిమాన్ పవన్ (Demon Pavan) కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. నాకు నీతి, నిజాయితీగా ఉండటమే వచ్చు.. నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూను టాప్ 5లో పెట్టారు. అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్.
నో ఎలిమినేషన్
ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈవారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు? తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్‌రెడీ నాగ్.. దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హర్ట్ అయినట్లే కనిపిస్తోంది!


