‘పూరీసేతుపతి’ సినిమా షూటింగ్ పూర్తయింది. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పూరీసేతుపతి’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ ప్రధానపాత్రల్లో నటించారు.
ఛార్మీ కౌర్ సమర్పణలో పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.


