బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) కంటెస్టెంట్ల కోసం వీకెండ్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. నిన్న భరణి కోసం నాగబాబు రాగా, నేడు తనూజ కోసం ముద్దమందారం సీరియల్ స్టార్స్ స్టేజీపైకి వచ్చేశారు. సుమన్ కోసం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
లేడీ సింగం
సీరియల్ నటి హరితను చూడగానే తనూజ చాలా మిస్ అయ్యానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు హరిత కూడా ఎమోషనలైంది. ముద్దమందారం హీరో పవన్.. తనూజను లేడీ సింగంగా అభివర్ణించాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫోటో ఉన్న కార్డ్‌ను బయటకు తీశాడు. దీంతో నాగ్.. ఆ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమన్నాడు. అందుకు పవన్.. అది నా పిల్ల అని చెప్పాడు. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణికి సలహా ఇచ్చాడు.

ఎమోషనల్ ప్రోమో
నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను కప్పుతో చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని హరిత చెప్పగానే తనూజ భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రోమో చూసిన తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నింటికన్నా.. అది నా పిల్ల అనే డైలాగ్ బాగా హైలైట్ అయిందంటున్నారు. మరి దానికి కల్యాణ్ ఎలా ఫీలవుతున్నాడో? ఏంటో!


