breaking news
Pavan Sai
-
అది నా పిల్లరా..: ముద్ద మందారం హీరో
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) కంటెస్టెంట్ల కోసం వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. నిన్న భరణి కోసం నాగబాబు రాగా, నేడు తనూజ కోసం ముద్దమందారం సీరియల్ స్టార్స్ స్టేజీపైకి వచ్చేశారు. సుమన్ కోసం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.లేడీ సింగంసీరియల్ నటి హరితను చూడగానే తనూజ చాలా మిస్ అయ్యానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు హరిత కూడా ఎమోషనలైంది. ముద్దమందారం హీరో పవన్.. తనూజను లేడీ సింగంగా అభివర్ణించాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫోటో ఉన్న కార్డ్‌ను బయటకు తీశాడు. దీంతో నాగ్.. ఆ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమన్నాడు. అందుకు పవన్.. అది నా పిల్ల అని చెప్పాడు. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణికి సలహా ఇచ్చాడు.ఎమోషనల్ ప్రోమోనాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను కప్పుతో చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని హరిత చెప్పగానే తనూజ భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రోమో చూసిన తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నింటికన్నా.. అది నా పిల్ల అనే డైలాగ్ బాగా హైలైట్ అయిందంటున్నారు. మరి దానికి కల్యాణ్ ఎలా ఫీలవుతున్నాడో? ఏంటో! చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్.. దివ్యను కాపాడేందుకే! -
పెళ్లింట విషాదం
భూత్పూర్: పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే, పసుపు పారాణి ఆరకముందే ఆ ఇంట చావు డప్పు మోగింది. వివాహ రిసెప్షన్ అనంతరం వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడుతో సహా ముగ్గురు చనిపోగా, షాక్‌కు గురైన వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద హైవేపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా... ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ, వాణి దంపతులకు అనూష ఒక్కగానొక్క కూతురు. ఈమెకు ఈ నెల 15న హైదరాబాద్‌కు చెందిన పవన్సాయితో అనంతపురంలో వివాహం కాగా హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో రెండురోజుల కిందట రిసెప్షన్ నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కారులో అనంతపురానికి తిరుగు ప్ర యాణమయ్యారు. నంబూరు వెంకటరమణ(55), కూ తు రు అనూష, అల్లుడు పవన్‌సాయి(25), డ్రైవర్ చంద్ర (27) ప్రయాణిస్తున్న కారు అన్నాసాగర్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఓవర్‌టెక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్‌ను బలంగా ఢీకొని 10 ఫీట్ల వరకు గాలిలో ఎగిరి చెట్టును ఢీకొంది. దీంతో వెంకటరమ ణ, పవన్‌సాయి, డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అనూష తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. నంబూరు వెంకటరమణ నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ఐగా పనిచేస్తున్నారు. కళ్ల ముందే తండ్రి, భర్త మృత్యువాత.. కారు ముందు సీట్లో కూర్చున్న తండ్రి వెంకటరమణ, పక్కనే కూర్చున్న భర్త పవన్ మృతి చెందడంతో అనూష షాక్‌కు గు రైంది. ప్రమాద విషయాన్ని వెనకాల కారులో వస్తున్న తల్లి వాణికి ఫోన్లో చెప్పి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. అతివేగమే కారణం.. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో కారు వేగం 120– 140 కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.


