పెళ్లింట విషాదం

Road accident in Mahbubnagar district - Sakshi

హైవేపై రోడ్డు ప్రమాదం

కంటైనర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తూ చెట్టును ఢీకొన్న కారు 

నవవరుడు, మామ, కారు డ్రైవర్‌ మృతి 

అపస్మారక స్థితిలోకి నవవధువు... ఎస్వీఎస్‌కు తరలింపు 

మృతుల్లో నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్‌ఐ 

మహబూబ్‌నగర్‌ జిల్లా అన్నాసాగర్‌ వద్ద ఘటన

భూత్పూర్‌: పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే, పసుపు పారాణి ఆరకముందే ఆ ఇంట చావు డప్పు మోగింది. వివాహ రిసెప్షన్‌ అనంతరం వధువు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడుతో సహా ముగ్గురు చనిపోగా, షాక్‌కు గురైన వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ వద్ద హైవేపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనమిలా... ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ, వాణి దంపతులకు అనూష ఒక్కగానొక్క కూతురు.

ఈమెకు ఈ నెల 15న హైదరాబాద్‌కు చెందిన పవన్‌సాయితో అనంతపురంలో వివాహం కాగా హైదరాబాద్‌లోని పవన్‌సాయి ఇంట్లో రెండురోజుల కిందట రిసెప్షన్‌ నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కారులో అనంతపురానికి తిరుగు ప్ర యాణమయ్యారు. నంబూరు వెంకటరమణ(55), కూ తు రు అనూష, అల్లుడు పవన్‌సాయి(25), డ్రైవర్‌ చంద్ర (27) ప్రయాణిస్తున్న కారు అన్నాసాగర్‌ వద్ద ముందు వెళ్తున్న  కంటైనర్‌ను ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది.

కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్‌ను బలంగా ఢీకొని 10 ఫీట్ల వరకు గాలిలో ఎగిరి చెట్టును ఢీకొంది. దీంతో వెంకటరమ ణ, పవన్‌సాయి, డ్రైవర్‌ చంద్ర అక్కడికక్కడే మృతిచెందగా.. అనూష తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. నంబూరు వెంకటరమణ నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. 

కళ్ల ముందే తండ్రి, భర్త మృత్యువాత.. 
కారు ముందు సీట్లో కూర్చున్న తండ్రి వెంకటరమణ, పక్కనే కూర్చున్న భర్త పవన్‌ మృతి చెందడంతో అనూష షాక్‌కు గు రైంది. ప్రమాద విషయాన్ని వెనకాల కారులో వస్తున్న తల్లి వాణికి ఫోన్‌లో చెప్పి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.
 
అతివేగమే కారణం.. 
కారు డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో కారు వేగం 120– 140 కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు నుజ్జునుజ్జయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top