మండే వచ్చిందంటే నామినేషన్స్ పండగ. గొడవలు, అరుపులు, కేకలతో బిగ్‌బాస్ హౌస్ దద్దరిల్లుతుంది. గత వారం తనూజ, దివ్య ఎంతలా అరుచుకున్నారో అందరం చూశాం. మరి ఈ వారం ఎవరి మధ్య వార్ జరగనుందో చూడాలి! 12వ వారం నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.
12వ వారం నామినేషన్స్
ఈసారి నామినేషన్స్ రెండు లెవల్స్‌లో ఉంటుందన్నాడు బిగ్‌బాస్. మొదటగా ప్రైవేట్ నామినేషన్స్ జరుగుతాయన్నాడు. అలా ప్రతి ఒక్కరూ ఫేస్ టు ఫేస్ కాకుండా ప్రైవేట్‌గా నామినేట్ చేశారు. అలా ఇమ్మాన్యుయేల్.. పవన్‌ను, కల్యాణ్.. సుమన్‌ను, పవన్.. కల్యాణ్‌ను నామినేట్ చేశారు. 'ఇద్దరి గొడవల్లో తనూజ మళ్లీ నన్ను లాగింది. ఇదేదో చిన్నపిల్లల ఆటలా అయిపోతుంది.
నామినేషన్స్‌లో ఎవరంటే?
ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించట్లేదు' అంటూ భరణి.. తనూజను నామినేట్ చేశాడు. నావైపు నిల్చుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్‌ను ఎఫెక్ట్ చేసిందంటూ దివ్య.. భరణిని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ రీతూ తప్ప మిగతా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.


