ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం | ACB raids on Kukatpally circle GHMC section officer | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ తిమింగలం

Jul 13 2015 9:14 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ ఇమ్మానియేల్ నివాసంపై ఏసీబీ అధికారులు ...

హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.  జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్  ఇమ్మానియేల్ నివాసంపై ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గతంలో ఇమ్మానియేల్ మీద ఆరోపణలు రావటంతో ఈ సోదాలు చేపట్టారు.

 

దాదాపు అయిదు కోట్ల వరకూ అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తోని రెండు ప్రాంతాలతో పాటు వరంగల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement