 
													తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. అప్పుడే హౌస్‌లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటి వరకు కాస్తా సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ అనగానే ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారు. అగ్రెసివ్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌లో హౌస్‌లో మాస్క్ మ్యాన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనొక్కడే అందరిపై నోరు పారేసుకుంటున్నారని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు.
అయితే రెండో వారంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్‌ను మిగిలిన కంటెస్టెంట్స్ సైతం ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో మాస్క్ మ్యాన్‌కు కమెడియన్ ఇమ్మాన్యూయేల్ గట్టిగానే కౌంటరిచ్చాడు. నామినేషన్స్‌లో భాగంగా హరీశ్, ఇమ్మాన్యుయేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గుండంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటని హరీశ్‌ను ఇమ్మాన్యుయేల్ నిలదీశాడు. ఇది విన్న మాస్క్ మ్యాన్ నేను మిమ్మల్ని అనలేదంటూ మాట్లాడారు. దీనికి ఇమ్మాన్యూయేల్ సైతం రెచ్చిపోయి ముందుకు దూసుకెళ్లారు. నేను కూడా అన్నది మిమ్మల్ని కాదని..నన్ను నేనే అనుకున్నానని అన్నారు.
దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. మీరన్నదానికి ప్రూఫ్ ఉందని ఇమ్మాన్యుయేల్ చెప్పగా.. లిమిట్స్‌లో ఉండాలంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా గట్టిగా కేకలు వేస్తూ ఇమ్మాన్యుయేల్ వైపు దూసుకెళ్లాడు హరీశ్. ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకేందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.
High voltage nominations! 🔥
Real opinions revealed, #SumanShetty breaks his silence! 👁️💣
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/hzGJhuRkjL— JioHotstar Telugu (@JioHotstarTel_) September 16, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
