
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్‌బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.
సత్తా చూపించిన రాము
అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.

బాడీ షేమింగ్
నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్‌లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు.
ముగ్గురు ఆడోళ్లు
ఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.
దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్
కెప్టెన్ సంజనా హౌస్‌మేట్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్‌డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్‌డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్‌డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్‌డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి!