
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాలని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్‌గా ఉన్నారు.
రెచ్చిపోయిన భరణి
హౌస్‌లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు నాగ్. అనంతరం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.
పర్మినెంట్ ఓనర్‌గా భరణి
ఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ బ్లూ టీమ్‌లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి మాత్రం భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్‌గా మారిపోయాడు. భరణిని ఓనర్‌గా ప్రకటించగానే కామనర్లు ముఖాలు మాడిపోయాయి.
మాట మార్చిన ఇమ్మాన్యుయేల్
అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఓ టాస్క్ ఇచ్చారు.
నమ్మకం మీద దెబ్బ కొట్టారు
అందులో భాగంగా జెన్యూన్‌గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. టెనెంట్స్‌లో సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్‌బాంబ్ వేసింది.
చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?