ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌కు పెను ప్రమాదం తప్పింది. సిరియాలో మెక్రాన్ బసచేసిన హోటల్ వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రమాదం నుంచి అధ్యక్షుడు తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సిరియా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా డమాస్కస్‌లో ఆయన హోటల్లో బసచేశారు. అయితే ఆ హోటల్ సమీపంలో మూడు కారు బాంబులు పేలడంతో తీవ్ర కలకలం రేగింది. పేలుళ్లు జరిగిన సమయంలో, ఆయన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో కలిసి అధ్యక్ష భవనంలో ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.2024లో అహ్మద్ అల్-షారా నేతృత్వంలోని తిరుగుబాటుదారులు బషర్ అల్-అసద్ పాలనను పడగొట్టిన తర్వాత, సిరియాలో పర్యటించిన మొదటి యూరోపియన్ యూనియన్ (EU) దేశాధినేత మాక్రాన్ మాత్రమే.
ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఈ పేలుళ్లు సిరియాలో ఇంకా ఎదురవుతున్న భారీ భద్రతా సవాళ్లను మరోసిరా తేటతెల్లం చేశాయి.
The target was a bus for the Ministry of Tourism near the Four Seasons. This is an assassination attempt against Macron pic.twitter.com/CDIVYKdZkm
— Munir 🇱🇧🇵🇸 (@JnoubiSyrian) July 7, 2026


