
బిగ్‌బాస్ 44వ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో కల్యాణ్ చేసిన పనికి తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య గొడవ మొదలైంది. ఇదంత మంగళవారం ఎపిసోడ్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను బెలూన్ టాస్క్‌ల పేరుతో ఇమ్ము, అయేషా చేతిలో బిగ్‌బాస్ పెట్టడం. అందులో వారిద్దరూ గెలుచుకున్న టికెట్లు తమకు నచ్చిన వారికి ఇవ్వొచ్చు. వాళ్లు వెళ్లి నామినేషన్స్ చేయవచ్చు. అయితే, ఒక టికెట్ కల్యాణ్‌కు ఇస్తాడు ఇమ్ము. అతను సంజనాను నామినేట్ చేయడంతో ఇమ్ము ఆశ్చర్యపోతాడు.
కల్యాణ్.. నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరు ఒకటి.. ఇప్పుడు చేసిందొకటి. ఇదేంటి అంటూ గొడవకు దిగుతాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి నా వద్ద టికెట్ తీసుకున్నావ్.. ఇలా మాట తప్పుతావని అసలు ఊహించలేదంటూ మాట్లాడుతాడు. తనూజను నేను కూడా నామినేట్ చేయాలని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చి చేస్తానని చెప్పడంతో నేను నిన్ను నమ్మి నామినేషన్ టికెట్ ఇచ్చానంటూ కల్యాణ్‌పై ఫైర్ అవుతాడు.
తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య చిచ్చు
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం నుంచి ఇమ్ము, కల్యాణ్‌తో తనూజ బాగానే క్లోజ్ ఉంది. ఇప్పుడు తనను నామినేషన్ చేసేందుకు ఇలా వారిద్దరూ పోటీ పడటం తనకు నచ్చలేదు. ఇది చాలా మోసం అంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో దివ్యతో చెబుతుంది. ఐదు నామినేషన్స్ టికెట్లు గెలుచుకున్న ఇమ్ము ఒకటి కూడా తన వద్ద ఉంచుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. అదేదో ఒక టికెట్ తనే ఉపయోగించి తనూజను నామినేషన్ చేసి ఉంటే ఇమ్ముకు పాజిటివ్ వచ్చేది. ఇలా సేఫ్‌గా కల్యాణ్‌తో ఆట నడిపించే ప్రయత్నం చేసి చెడ్డపేరు తెచ్చుకున్నాడు.
తనూజ, ఇమ్ము మధ్య వార్ మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తుంది. నేను ఎవరినీ కేర్ చేయనంటూ ఇమ్ముతో తనూజ అంటుంది. అంతే రేంజ్‌లో ఇమ్ము కూడా సమాధానం ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేశాననే బాధ నాలో ఉందని ఇమ్ము అనడం.. ఆపై తనూజ కూడా ఆటలో ఎవరు ఎవరి కోసం నిలబడరని చెప్పడం. దానికి ఇమ్ము కూడా చిన్నపిల్లోడిలా అప్పుడు నీ కోసం ఇది చేశాను.. అది చేశాను అని చెబుతూ పాత విషయాలు తెరపైకి తీసుకొచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం చాలా ఫైర్‌గానే ఉంది.