
బిగ్‌బాస్ 9 తెలుగు నుంచి బుల్లితెర నటుడు భరణి ఎలిమినేట్ అయిపోయారు. సుమారు వారాల పాటు ఆయన హౌస్‌లో కొనసాగారు. ఆదివారం జరిగిన దీపావళి ఎపిసోడ్‌లో నటుడు నాగార్జున (Nagarjuna) వ్యాఖ్యతగా వ్యవహరించారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారంగా భరణి ఎలిమినేట్ అయ్యారని నాగ్ ప్రకటించారు. దీంతో ఆయన హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే, ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నుంచి ఆయన ఎంత సంపాదించారనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
బిగ్ బాస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఎంత అనేది ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ సీజన్‌లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఉన్నారు. అందుకే ఈ సీజన్‌లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో ఉన్న 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే ఆయన అందుకున్నట్లు సమాచారం. డబ్బు కంటే ఎక్కువ ఆయన మంచి పేరు సంపాదించాడని చెప్పవచ్చు. అయితే, హౌస్‌లో చాలామందితో ఎక్కువ బంధాలు పెట్టుకోవడం వల్లే ఎలిమినేట్ అయ్యారని తెలిసిందే.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరూ సేవ్ అవుతూ.. ఫైనల్‌గా భరణి, రాము రాథోడ్ నిలిచారు. వీరిద్దరిలో భరణి ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. దీంతో తనూజ, దివ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న పవర్ అస్త్ర భరణి కోసం ఉపయోగించి ఉండుంటే సేవ్ అయిండేవాడు. కానీ, అతను రాము రాథోడ్‌కు ఉపయోగించడం.. ఆపై ఓట్ల పరంగా కూడా రాము సేఫ్ జోన్‌లో ఉండటంతో అందరూ షాక్ అయ్యారు.