
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్, శ్రీజ, భరణి వరుసగా హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పుడు మరొకరిని పంపించేందుకు నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది.
కెప్టెన్ల చేతిలో పవర్
నామినేషన్ చేసే హక్కును కూడా పోరాడి గెలవాల్సి ఉంటుందన్నాడు బిగ్‌బాస్. ఆ పోరాటానికి ఇద్దర్ని ఎంపిక చేసుకోమని కెప్టెన్స్‌కు పవర్స్ ఇచ్చారు. దీంతో గౌరవ్.. ఆయేషాను, సుమన్.. ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశాడు. ఆయేషా, ఇమ్మూకి బిగ్‌బాస్ బెలూన్ల టాస్క్ ఇచ్చాడు. బెలూన్ పగలగొట్టినప్పుడు అందులో ఓ చిట్టీ వస్తుంది. దానిపై రాసున్నదాని ప్రకారం నామినేషన్స్ ముందుకు సాగుతాయి. ఈ క్రమంలో ఆయేషా.. రీతూను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది.
నామినేషన్స్
నువ్వు, నీ ఓవరాక్షన్ నచ్చలేదు. నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ పర్సనల్ అటాక్ చేసింది. దానికి రీతూ.. నేను లవ్ చేస్తున్నానని చెప్పానా? అని నిలదీసింది. అప్పటికీ తగ్గని ఆయేషా... నీకంత యాటిట్యూడ్ ఎందుకే? నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని మండిపడింది. చూస్తుంటే వీరిమధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. రమ్య, సాయి, రీతూ, తనూజ, దివ్య, రాము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయేషా నామినేషన్‌లో ఉండాల్సింది. కానీ గౌరవ్ సేవ్ చేయడంతో ఆమె గండం గట్టెక్కింది.