సంగీత దర్శకుడు ఇళయరాజా, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలను ఉపయోగించారు. దీంతో కాపీరైట్స్ వివాదం తలెత్తింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారని అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇళయరాజాతో మైత్రీ మూవీస్ సయోధ్య కుదుర్చుకున్నట్లు సోషల్‌మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆయన పాటలను ఉపయోగించినందుకు గాను రూ.50 లక్షలు చెల్లించడానికి మైత్రీ మూవీస్ అంగీకరించినట్లు సమాచారం. అందుకోసం ఇళయరాజాకు సంబంధించిన న్యాయవాధిని వారు సంప్రదించారట. అయితే, ఈ అంశంపై అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు.


