కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్‌లాల్ సుందర్‌దాస్ చెన్నై హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రిలీజ్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Interim Ban on ‘#VaaVaathiyaar’
The Madras High Court has issued an interim stay on the release of the film Vaa Vaathiyaar, starring #Karthi and produced by Studio Green.
In a case filed by Arjunlal Sundardas against Gnanavel Raja, the court ordered that the film should not be… pic.twitter.com/tOo456lm1I— Movie Tamil (@_MovieTamil) December 4, 2025


