ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ డ్రైవ్. ఈ మూవీకి జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇవాళ రిలీజైన టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సీన్స్ చూస్తే ఫుల్ గ్రిప్పింగ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహాన్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఓషో వెంకర్ సంగీతమందించారు.


