
బిగ్‌బాస్ రియాలిటీ షో రెండో వారం హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియగా.. కెప్టెన్సీ టాస్క్ కూడా పూర్తయింది. హౌస్‌లో రెండో కెప్టెన్‌గా డీమాన్ పవన్ ఎంపికయ్యారు. ఇప్పుడిక టెనెంట్స్‌కు ఓనరయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందుకోసం సెలబ్రిటీలకు గేమ్స్ పెట్టాడు. ఓనర్లు విసిరే వస్తువులను పట్టుకుని వాటిని ఎండ్‌బజర్ వరకు తమ బాస్కెట్‌లో భద్రంగా దాచుకోవాలి.
ఇందులో భాగంగా రీతూ చౌదరి గేమ్‌లో పాల్గొంది. ఈ గేమ్ జరుగుతున్నప్పుడే మధ్యలో ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చాడు. రాము రాథోడ్ ఎందుకు కామ్‌గా ఉన్నాడంటూ సపోర్ట్‌గా వచ్చాడు. దీనికి రీతూ చౌదరి నీది నువ్వు చూసుకోవయ్యా.. రేలంగి మావయ్యలా ఇప్పుడొచ్చి మాట్లాడొద్దు గట్టిగా ఇచ్చిపడేసింది. నేను మాత్రం రేలంగి మావయ్యను కాదు కానీ..నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవు అంటూ ఇమ్మాన్యుయేల్ అన్నాడు. ఆ తర్వాత తనూజ, రీతూ చౌదరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఓనర్‌గా అయ్యేందుకు ఏ రేంజ్‌లో కొట్టుకున్నారో తెలుస్తోంది. ఈ ప్రోమో చూస్తుంటే ఇవాల్టి ఎపిసోడ్ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు అర్థమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం లేటేస్ట్ ప్రోమో చూసేయండి.
#RithuChowdhary vs #Thanuja ⚔️ Who’s really playing the game? 👁️🧨
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/dAc20cyQAL— Starmaa (@StarMaa) September 19, 2025