
బిగ్‌బాస్ షోలో ఇప్పటివరకు 8 సీజన్లు జరిగాయి. ప్రతి వీకెండ్‌లోనూ వచ్చే నాగార్జున.. హౌస్‌మేట్స్ తప్పొప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్లతో మాట్లాడేవారు. చాలావరకు నాగ్ చెప్పిన దానికి వాళ్ల వైపు నుంచి సానుకూలంగా సమాధానం వచ్చేది. కొన్నిసార్లు మాత్రం హోస్ట్‌తో వాదించేవారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా నాగార్జున తనని తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నారని మాస్క్ మ్యాన్ సీరియస్ అయిపోయాడు. దీంతో హరీశ్ vs నాగార్జున అన్నట్లు సాగింది.
(ఇదీ చదవండి: 'ఫ్రీ బర్డ్' గోల.. సంజన అలా ఎందుకు చేశావ్?)
శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి ఇదివరకు ఓ ప్రోమో రిలీజ్ చేయగా అందులో సంజనకు నాగార్జున కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేయగా.. ఇమ్మాన్యుయేల్-హరీశ్ గొడవ గురించి మాట్లాడారు. ఇమ్ము.. సరదాకే గుండంకుల్ అని అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారని అడగ్గా హౌసులోని అందరూ చేతులెత్తారు. దీంతో మాస్క్ మ్యాన్ హరీశ్‌దే తప్పు అన్నట్లు తేలింది. మరోవైపు ఇతడు.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి గురించి మాట్లాడిన ఓ వీడియోని స్క్రీన్ పై ప్రసారం చేయడంతో కొత్త వివాదం మొదలైంది.
ఆ వీడియోలో మాస్క్ మ్యాన్ హరీశ్.. తనూజతో పాటు ఉన్న ఇమ్మాన్యుయేల్, భరణిని ఆడవాళ్లు అని పరోక్షంగా అన్నాడు. అయితే కావాలనే తనని తప్పుగా చూపిస్తున్నారని హరీశ్.. నాగార్జుననే నేరుగా అనేశాడు. నేను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నానా అని ఆశ్చర్యపోవడం నాగ్ వంతైంది. దీంతో ఈ గొడవకు సమాధానం చెప్పలేకపోయిన హరీశ్.. షో నుంచి క్విట్(వెళ్లిపోతా) అయిపోతా అని అన్నట్లు ప్రోమోలో చూపించారు. మరి నిజంగానే మాస్క్ మ్యాన్‌ని హౌస్ నుంచి బయటకు పంపేస్తారా? లేదంటే ఈ వివాదానికి ఎలా పుల్‌స్టాప్ పెడతారో చూడాలి?
(ఇదీ చదవండి: డేంజర్ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)