బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో విడుదలైన 16 రోజుల్లో ఏకంగా రూ. 785 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించిన ఏడో హిందీ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. షారూఖ్ ఖాన్ 'జవాన్', శ్రద్ధా కపూర్ 'స్త్రీ -2' చిత్రాల కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం రోజే ఛావా(రూ.807 కోట్లు) వసూళ్లను అధిగమించేలా కనిపిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ వల్ల దురంధర్ కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు.


