బిగ్‌బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్‌గా చరిత్ర సృష్టించనుందా? ఆన్‌లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..
టాప్ 5 ఫైనలిస్టులు
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్‌లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్‌గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్‌గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
అది సరిపోదు
మొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్‌లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.
ఓట్లు గుద్దిపడేసిన అభిమానులు
టాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్‌లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్‌డ్ కాల్స్, హాట్‌స్టార్‌లో ఓటింగ్‌తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది.
పవన్‌కు పెరిగిన ఓటింగ్
మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్‌లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్‌గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.
ఈ ఇద్దరి మధ్యే పోటీ
ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్‌కు సడన్‌గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్‌గా నిలవనున్నారు. ప్రతి సీజన్‌లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్‌లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.
తనూజపై అక్కసు
వాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్‌లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి.
ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!
ఓటింగ్‌లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు!


