పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే? | The Paradise Producer Comments On Release Date | Sakshi
Sakshi News home page

The Paradise Movie: పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?

Dec 21 2025 7:32 AM | Updated on Dec 21 2025 7:51 AM

The Paradise Producer Comments On Release Date

నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ‍అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ఈ చిత్రంలో కమెడియన్ ‍సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్‌ డేట్‌పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.

ఇప్పటికే ది ప్యారడైజ్‌ మూవీ రిలీజ్ డేట్ ‍ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా ‍మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్‌కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్‌పోస్‌ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement