
సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది.
ఫస్ట్ సాంగ్ రిలీజ్
గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్‌లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో.
చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్