
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) విజువల్ వండర్ అవతార్(Avatar). ఆ తర్వాత అవతార్-2 కూడా ఆడియన్స్ను కట్టిపడేసింది. దీంతో ఈ సిరీస్లో మూడో పార్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కామెరూన్. అవతార్: ఫైర్ అండ్ యాష్ పేరుతో ఈ పార్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరోసారి తెలుగులోట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే జేమ్స్ కామెరూన్ విజువల్ మార్క్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచంలోని విషయాలు .. నువ్వు ఊహించిన దానికంటే లోతైనవి అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ఫైట్ సీన్స్ అవతార్ మూవీ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం విజువల్ వండర్ను చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో ఈ చిత్రంలో సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ ఛాంపియన్, బెయిలీ బాస్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రల్లో నటించారు.