
'నా కోడళ్లు బంగారం అంటోంది' హీరో అక్కినేని నాగార్జున భార్య, నటి అమల అక్కినేని (Amala Akkineni). మంచి కోడళ్లు దొరికినందుకు సంతోషంగా ఉన్నానని చెప్తోంది. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ, జైనబ్‌ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అమల మాట్లాడుతూ.. నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా మారింది. వారి వల్లే నాకు గర్ల్స్ సర్కిల్ ఏర్పడింది.
బిజీగా ఉండటం మంచిదే!
కోడళ్లిద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఈ కాలం అమ్మాయిలు బిజీగా ఉండటం మంచిదే! వాళ్ల పనుల్లో వారు బిజీగా ఉంటే నా పనులతో నేను బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు.. ఒక సాధారణ తల్లిని మాత్రమే! అని అమల చెప్పుకొచ్చింది.
అక్కినేని కుటుంబం
నాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య సంతానం. 1990వ సంవత్సరంలో దంపతులు విడిపోయారు. అనంతరం 1992లో నాగ్.. నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ సంతానం. నాగచైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. 2024లో హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లాడాడు. అఖిల్.. జైనబ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
చదవండి: ఒక్క టాస్క్‌కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం!