Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్‌.. అన్నావదినలదే హవా! | Naga Chaitanya, Sobhita Dhulipala Special Look in Akhil, Zainab Reception | Sakshi
Sakshi News home page

Chay-Sobhita: తమ్ముడి పెళ్లంటే.. ఆ మాత్రం ఉండాలిగా! ఫుల్‌ జోష్‌లో చై దంపతులు

Jun 12 2025 1:40 PM | Updated on Jun 12 2025 5:20 PM

Naga Chaitanya, Sobhita Dhulipala Special Look in Akhil, Zainab Reception

అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్‌ 6, 2025న) అఖిల్‌ వివాహం జరిగింది. బిజినెస్‌మెన్‌ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్‌ను అఖిల్‌ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్‌గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్‌ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, సూర్య, యశ్‌, నిఖిల్‌, అల్లరి నరేశ్‌, సుకుమార్‌, బుచ్చిబాబు, తమన్‌.. ఇలా ఎంతోమంది వచ్చారు.

రిసెప్షన్‌లో హైలైట్‌..
ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) హ్యాండిల్‌లో రిలీజ్‌ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్‌ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్‌గా బంగారు వర్ణం బ్లౌజ్‌ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్‌లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్‌ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్‌ సునీత ఎమోషనల్‌

Advertisement
 
Advertisement
Advertisement