
టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) చివరగా తండేల్ సినిమాతో మెప్పించాడు. ఈ సినిమాతో పాటు ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సాయిపల్లవిని ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తుంటాడు. అయితే రియల్ లైఫ్‌లో భార్య శోభిత ధూళిపాళను అలా ముద్దుగా పిలుస్తానంటున్నాడు నాగచైతన్య. తాజాగా చై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
శోభితతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా..
అతడు మాట్లాడుతూ.. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడిపలేకపోతున్నాను. మా మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతాం. ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేస్తాం. సినిమాలకు, షికార్లకు వెళ్లినా ఆ క్షణాలను ప్రత్యేకంగా మార్చుకుంటాం. ఈ మధ్యే తనకు రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్ నేర్పించాను. రేసింగ్ నాకొక థెరపీలా పనిచేస్తుంది.
పిల్లలతో గడపాలనుంది
నాకంటూ పెద్ద కోరికలు లేవు. 50 ఏళ్లు వచ్చేసరికి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరో, ఇద్దరో పిల్లలు కావాలనుకుంటున్నాను. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా.. కూతురు పుడితే తన ఇష్టాలను ప్రోత్సహిస్తాను. పిల్లలతో సమయం గడపాలనుంది. చిన్నప్పుడు నేనెలా ఎంజాయ్ చేశానో.. ఇప్పుడు పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పుకొచ్చాడు. చైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.
చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్యకు ఆరో నెల