 
													టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి సింపుల్‌గా, రిసెప్షన్ ఘనంగా జరిగింది. ప్రియురాలు జైనబ్ రవ్జీని అఖిల్ హిందూసాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. జూన్ 6న వెడ్డింగ్, 8న రిసెప్షన్ వేడుకలు జరిపారు. రిసెప్షన్‌లో ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో 1
జైనబ్ బొమ్మలా నిల్చుని ఉంటే ఓ యువకుడు తనకు చకచకా పెళ్లిచీర కట్టేశాడు. ఇది చూసిన జనాలు అయ్యో, జైనబ్‌కు చీర కట్టుకోవడం రాదా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సులువుగా ఆమెకు చీర కట్టేసిన యువకుడి నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.
వీడియో 2
అఖిల్- జైనబ్ రిసెప్షన్‌కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యాడు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో స్టేజీ ఎక్కిన తమన్.. ఫ్రెండ్‌కు ఊహించలేని బహుమతిచ్చాడు. క్రికెట్ బ్యాట్‌ను కానుకగా ఇచ్చాడు. దీంతో పెళ్లికూతురు సహా అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అభిమానులు సైతం ఇదేం గిఫ్ట్‌రా నాయనా.. అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సినిమాల్లో తడబడుతున్న అయ్యగారు (అఖిల్) క్రికెట్‌లో మాత్రం నెం.1. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. తమన్ ఈ జట్టులోనే ఆడుతున్నాడు.
Bro wait .! 🙄 pic.twitter.com/3InivJmTjc
— 🕴🏼 (@kaali02) June 11, 2025
Thaman gifted a cricket bat to #AkhilAkkineni at his reception! pic.twitter.com/Mu914iRI2a
— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2025
చదవండి: ఆ హీరోయిన్‌ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
