
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ నటించిన‘ఓజీ’ (OG) సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ తదితరులు నటించారు. 'హరి హర వీరమల్లు' వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన ఓజీ కాస్త పర్వాలేదనిపించింది.
ఓజీ సినిమా అక్టోబర్ 23 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ,తమిళ్, కన్నడ, మలయాళంలో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టిన ఓజీ ఆ తర్వాత ఆశించినంత రేంజ్‌లో కలెక్ట్ చేయలేదు. కాంతార సినిమా విడుదల తర్వాత చాలాచోట్ల ఓజీ చిత్రాన్ని తొలగించేశారు కూడా. దీంతో ఓజీ బయ్యర్లకు నష్టాలు తప్పలేదు.

ఓజీ కథేంటి..?
ఓజీ కథ అంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్‌లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్) ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్‌రాజ్)పై అటాక్ జరిగితే.. రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్‌ని నిర్మించి.. సత్యదాదా డాన్‌గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్‌లో కొత్త జీవితం ప్రారంభిస్తారు.
ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్‌లో ఉన్న తన కంటేనర్‌ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్‌లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్‌ని స్వాధీనం చేసుకొని.. అతడి మనుషులను దారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్‌లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.