
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఎంత పెద్ద సినిమాలైనా నెల రోజుల తర్వాత ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్‌లకైతే కొదవే లేదు. వారంలో నాలుగైదు వెబ్ సిరీస్‌లే ఉంటున్నాయి. వీటిలో క్రైమ్, రొమాంటిక్ ఓరియంటేడ్ స్టోరీలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో మరో ఆసక్తికర సిరీస్ అలరించేందుకు వచ్చేస్తోంది.
తెలుగులో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఆనందలహరి (Ananda lahari). ఈ సిరీస్‌లో ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి నేపథ్యంలో తీశారు. ఇందులో అభిషేక్, భ్రమరాంబిక జంటగా నటించారు ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. ఈ నెల 17 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సాయి వానపల్లి దర్శకత్వం వహించారు.
2 days to go!
Not just another love story… it’s an Anandalahari of fun, drama & heart!
Oct 17th, witness how East meets West — in love, war & Flexi Raju style! 😎@sureshProdns @SouthBayLive#aha #SureshProductionsmini pic.twitter.com/AuSbATe8uz— ahavideoin (@ahavideoIN) October 15, 2025