విష్ణు, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో హేమ అండ్ షాలినిల సమర్పణలో సుమంత్ నాయుడు .జి నిర్మించారు.
ఈ సినిమాను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా శనివారం రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్ నటించిన ఈ సినిమాకు సంగీతం: రథన్.


