సరస్వతి సాహసం | Varalaxmi Sarathkumar UnveilsSaraswathi First Look | Sakshi
Sakshi News home page

సరస్వతి సాహసం

Feb 15 2026 5:18 AM | Updated on Feb 15 2026 5:18 AM

Varalaxmi Sarathkumar UnveilsSaraswathi First Look

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘సరస్వతి’. ఈ హై కాన్సెప్ట్‌ థ్రిల్లర్‌ సినిమాను దోస డైరీస్‌ పతాకంపై వరలక్ష్మీ శరత్‌కుమార్, ఆమె సోదరి పూజా శరత్‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరోయిన్‌ సమంత లాంచ్‌ చేశారు. ‘‘సరస్వతి’ జర్నీ నాకు ఎంతో ముఖ్యమైంది. ప్రతి కథకు ఓ లక్ష్యం ఉంటుంది.

క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం చేసిందే కానీ, లొంగిపోవాలనుకోలేదు’’ అంటూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఉద్దేశించి, పేర్కొన్నారు వరలక్ష్మి. జీవా, ప్రకాశ్‌రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్‌కుమార్, శ్రీకాంత్‌ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్‌. 

Advertisement
 
Advertisement
Advertisement