saraswathy
-
సరస్వతి సాహసం
వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘సరస్వతి’. ఈ హై కాన్సెప్ట్ థ్రిల్లర్ సినిమాను దోస డైరీస్ పతాకంపై వరలక్ష్మీ శరత్‌కుమార్, ఆమె సోదరి పూజా శరత్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరోయిన్ సమంత లాంచ్ చేశారు. ‘‘సరస్వతి’ జర్నీ నాకు ఎంతో ముఖ్యమైంది. ప్రతి కథకు ఓ లక్ష్యం ఉంటుంది.క్రూరమైన ప్రపంచానికి వ్యతిరేకంగా సరస్వతి ఎదురు నిలిచే సాహసం చేసిందే కానీ, లొంగిపోవాలనుకోలేదు’’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉద్దేశించి, పేర్కొన్నారు వరలక్ష్మి. జీవా, ప్రకాశ్‌రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, కిషోర్‌కుమార్, శ్రీకాంత్ అయ్యర్, రావు రమేష్, సప్తగిరి నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
జయ చికిత్స వివరాలను వెల్లడిస్తాం
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో దాచి పెట్టాల్సిన విషయం ఏమీలేదని అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు. జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు గురువారం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. జయలలిత చికిత్సకు సంబంధించిన విషయాలను కోర్టుకు తెలియజేస్తామని సరస్వతి చెప్పారు. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెకు చేసిన చికిత్స, డిశ్చార్జి అవుతారని భావిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మరణించేవరకు.. అన్ని విషయాలను తెలియజేస్తామని తెలిపారు. ప్రతి విషయంలో పారదర్శకంగా ఉంటామని సరస్వతి చెప్పారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించిన విషయం విదితమే. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలను వెల్లడించాలని కోరుతూ అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


