
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.1000 టికెట్ ధరల వల్లే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.( OG Movie Box Office Collections )
మొదటి ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ఓవరాల్‌గా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 90.25 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.100 కోట్లకు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఓజీ వసూళ్లకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.