ఓటీటీలోకి సెడెన్‌గా వచ్చేసిన 'జాన్వీ కపూర్‌' సినిమా | Sidharth Malhotra & Janhvi Kapoor’s Param Sundari Now Streaming on Prime | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి సెడెన్‌గా వచ్చేసిన 'జాన్వీ కపూర్‌' సినిమా

Oct 10 2025 3:42 PM | Updated on Oct 10 2025 3:51 PM

Janhvi Kapoor movie Param Sundari Ott streaming now

రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా( Sidharth Malhotra), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన హిందీ చిత్రం ‘పరమ్‌ సుందరి’(Param Sundari).  ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. ఆగష్టు 29న విడుదలైన ఈ చిత్రం కేరళ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్నంత రేంజ్‌లో బాలీవుడ్‌లో కూడా మెప్పించలేదు. కానీ, కలెక్షన్స్‌ పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. తుషార్‌ జలోటా దర్శకత్వం వహించగా దినేష్‌ విజన్‌ నిర్మించారు.

‘పరమ్‌ సుందరి’ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌  (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. పరమ్‌ సుందరిని చూడాలంటే రూ.349 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూవీలో కేరళ అమ్మాయిగా జాన్వీ, ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్‌ కనిపించారు. ఉత్తరాదికి చెందిన హీరోయిన్‌ను మలయాళ యువతిగా చూపించడంపై కేరళలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

దానికి జాన్వీ కూడా వివరణ ఇచ్చింది. మలయాళ సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. ఈ చిత్రంలో తమిళ యువతిగా కూడా ఆమె కనిపిస్తుంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 90 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement