
కాంతార సినిమాకు క్రేజ్ దక్కడంతో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రంపై భారీ దెబ్బ పడింది. ఓజీ కేవలం మొదటిరోజు మాత్రమే భారీ కలెక్షన్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత థియేటర్ల పరిస్థితి ధారుణంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కాంతార జోరు ఉండటంతో ఓజీ థియేటర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో ఓటీటీ బాటలోకి ఓజీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేవలం నెలరోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
ఓజీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (NetflixI) ఓటీటీ (OTT)లో ఆక్టోబర్ 23 నుంచి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ వర్షన్‌లో కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న ఓజీ విడుదలైంది. అయితే, కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాయాలని అత్యధిక ప్రీమియర్ షోలు (336) వేసి ఒక్కో టికెట్ ధర రూ. 1000 నిర్ణయించడంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల మొదటిరోజు కలెక్షన్ల రికార్డ్స్‌ను ఎంత మాత్రం టచ్ చేయలేకపోయింది. ఓజీ రెండోరోజు నుంచే ఒక్కసారిగా 80 శాతం పైగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. కాంతార విడుదల తర్వాత కలెక్షన్స్ పరిస్థితి మరింతగా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు ఓజీ రూ. 183 కోట్ల నెట్ సాధించినట్లు ప్రముఖ వెబ్‌సైట్ సాక్నిల్క్ పేర్కొంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారు నటించారు.