
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో భాగీ సినిమాకు ఎక్కువగానే ఫ్యాన్స్ ఉన్నారు. సెప్టెంబర్ 5న విడుదలైన భాగీ4 సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో హర్నాజ్ కౌర్ సంధూ, పంజాబీ బ్యూటీ సోనమ్ ప్రీత్ బజ్వా హీరోయిన్లుగా నటించారు. మితిమీరిన రక్తపాతంతో నిండిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని మాత్రం నిరాశపరచలేదని చెప్పాలి.
అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా భాగీ-4 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని అద్దె ప్రాతిపదికలో చూడొచ్చు. రూ. 349 అధనంగా చెల్లించి భాగీ-4 చూడొచ్చని ఆ సంస్థ ప్రకటించింది. ‘భీమా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. 'భాగీ' తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా 'భాగీ 3'లో మళ్లీ కలిసి నటించారు. 'భాగీ 2'లో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపించింది. అయితే, వీరిలో ఎవరూ భాగీ-4లో లేరు.