
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ఓజీ(OG Movie) అభిమానులకు బెంగళూరు పోలీసులు దిమ్మదిరిగే షాకిచ్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద రిలీజ్‌కు ముందే ఈవెంట్ నిర్వహించినందుకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఈవెంట్‌లో కొందరు ఫ్యాన్స్ కత్తులతో హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మడివాలా పోలీసులు వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సిటీ కోర్ట్ అనుమతితోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా బెంగళూరులోని ఓ థియేటర్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులు గొడవ చేయడంతో మిగిలిన ఆడియన్స్ ఇబ్బందులు పడ్డారు.
(ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)
ప్రీమియర్ షోకు ముందే పవన్ అభిమానులు రోడ్లను బ్లాక్ చేసి, డీజే పెట్టి నిబంధనలను ఉల్లంఘించారు. దీనిపై కన్నడ రక్షణ వేదిక సభ్యులు థియేటర్ వద్దకు చేరుకుని.. రూల్స్ పాటించాలని పవన్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సమాచారం అందగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అక్కడ ఉన్న లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకుని.. ఏర్పాటు చేసిన వేదికను కూల్చివేయమని నిర్వాహకులను చెప్పామని వెల్లడించారు. కాగా.. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.